న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ఐదు టీ20లో భారత్ 7పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ పై తొలిసారి ఐదు టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది.164 లక్ష్యం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ 20పాటు ఆడి 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణిత 20 ఓవర్ లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ 60 (41) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా ఓపెనర్ రాహుల్ 45(33) చేసి రాణించాడు. ఆఖర్లో భారత బాట్స్‌మెన్‌లలో శ్రేయాస్ అయ్యర్ (33), మనీష్ పాండే 11(4) పరుగులతో అజేయంగా నిలిచారు. దీనితో శివమ్ దూబే(5) సంజు శాంసన్ (2) నిరాశపరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో స్కాట్ రెండు వికెట్లు తీయగా.. బెన్నెట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
భారత్ నిర్ధేశించిన 164 లక్ష్యం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సీఫెర్ట్(50), రాస్ టేలర్(53), ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పని చేపట్టారు. టీమిండియా బౌలర్ శివమ్ దూబే చెత్త బౌలింగ్ వేశాడు. ఒకే ఓవర్ లో 34 పరుగులు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ పై జరిగిన ఈమ్యాచ్‌లో పదో ఓవర్ వేసిన దూబే ఆ ఓవర్ లో 6 6 4 1 4( నోబాల్), 6 6తో మొత్తం 34 పరుగులు సమర్పించాడు. దూబే వేసిన తొలి బంతిని సీఫెర్ట్ రెండు సిక్సులు బాదాడు. అదే ఓవర్ ఆఖరి రెండు బంతులకు టేలర్ రెండు సిక్సులు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 34 పరుగులు పిండుకొని ఆ ఓవర్ ముగిసే సరికి 93 పరుగులు చేసి పటిష్టస్థితిలో ఉంది.
అయితే 13 ఓవర్ అందుకున్న సైనీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. క్రీజులో పాతుకుపోయి అర్థశతకం చేసిన సిఫెర్ట్(50) ను ఔట్ చేశాడు. ఇక 14 ఓవర్ బౌలింగ్ వచ్చిన బుమ్రా విచెల్ (2)న ఔట్ చేశాడు. మరోవైపు రాస్ టేలర్ (53) పరుగులు చేసిన అతడ్ని కూడా షైనీ అవుట్ చేశాడు.దీంతో 99 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. మ్యాచ్ ఒక్కసారిగా భారత్ వైపు మలుపు తిరిగింది. టీమిండియా బౌలర్లలో బూమ్రా, మూడు వికెట్లు తీశాడు, సైనీ, ఠాకూర్ , తలా రెండు వికెట్లు దక్కించున్నారు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. భారత పర్యటనలో మూడు వన్డేల సిరీస్ ఈ నెల 5 బుధవారం నుంచి ప్రారంకానుంది.
Congratulations to India on a top series. Another win at Bay Oval despite some last over fireworks from Ish Sodhi. A 7 run win. Bumrah with 3-12 leading the bowling attack. Taylor top scoring with 53. Scorecard | https://t.co/C9zslxZiaE #NZvIND pic.twitter.com/H32plFcRUb
— BLACKCAPS (@BLACKCAPS) February 2, 2020