టీమిండియా కివీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ లోని చివరి టీ20లో భారత్ కివీస్ ముందు 164 లక్ష్యం ఉంచింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో కివీస్ ను సీఫెర్ట్(49), రాస్ టేలర్(43), ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పని చేపట్టారు. 12 ఓవర్లు ముగిసేసరికి కివీస్ మూడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 93 పరుగులు భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. టీమిండియా బౌలర్లలో బూమ్రా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ విజయానికి 48 బంతుల్లో 52 పరుగులు కావాలి. అయితే న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయినా పరిస్థితి మారే అవకాశం ఉంది.