Ind vs Ban 1st Test Day 3 : 493/6 వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్

ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మూడో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ని 493/6 వద్ద డిక్లేర్ చేసింది.

Update: 2019-11-16 04:39 GMT
India vs Bangladesh, 1st Test, Day 3

ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మూడో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ని 493/6 వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి మ్యాచ్‌లో శుక్రవారం 493/6తో టీమిండియా నిలిచింది. 343 పరుగుల ఆధిక్యం లభించడంతో 493/6 వద్ద డిక్లేర్ చేస్తున్నట్లు శనివారం మ్యాచ్ ఆరంభానికి ముందు కోహ్లీ ప్రకటించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ఇషాంత్ ఉమేశ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 

శుక్రవారం 86/1 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన భారత్ కి మయాంక్ అగర్వాల్(243: 330 బంతుల్లో 28x4, 8x6) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. సెంచరీ చేసి ఆ తర్వాత డబల్ సెంచరీ కొట్టి జట్టుకు భారీ ఆధిక్యాన్ని సంపాదించి పెట్టాడు. దీనితో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లను కోల్పోయి 493 పరుగులను సాధించి ఆటను ముగించింది. రవీంద్ర జడేజా (60: 76 బంతుల్లో 6x4, 2x6), ఉమేశ్ యాదవ్ (25 బ్యాటింగ్: 10 బంతుల్లో 1x4, 3x6) చేశారు.

భారత జట్టు మొదటి సెషన్ లో చతేశ్వర్ పుజారా (54: 72 బంతుల్లో 9x4) కలిసి ఆచితూచి ఆడాడు మయాంక్ . ఆ తర్వాత రెండవ సెషన్ లో బంగ్లా బౌలర్లకి చుక్కులు చూపిస్తూ పరుగులు సాధించాడు. ఇక చతేశ్వర్ పుజారా అవుట్ అయ్యాక ఆ వెంటనే కెప్టెన్ కోహ్లి డకౌటైయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానె (86: 172 బంతుల్లో 9x4)తో కలిసి భాధ్యతయుతమైన ఇన్నింగ్స్ ని ఆడాడు అగర్వాల్.. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే సమయంలో మయాంక్ తన రెండో డబల్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన మయాంక్ జట్టు స్కోరు 432 వద్ద మెహదీ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 


Keywords: India vs Bangladesh, 1st Test  Day 3, India Declare 493, Bangladesh by 343, India, Bangladesh, Cricket

Tags:    

Similar News