Manish Pandey: మనీష్ పాండే భారత క్రికెట్ జట్టు యువ కెరటం. ఐపీఎల్ లో సన్ రైసర్స్ హైదరాబాద్ జట్టు తరపున కీలక ఆటగాడిగా ఉన్న మనీష్ పాండే భారత జట్టు తరపున 2015న అంతర్జాతీయ వన్డే మ్యాచ్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆరంగేట్రం మ్యాచ్ తో ఆకట్టుకున్న మనీష్ పాండే గత మూడు ఏళ్ళుగా వన్డేలలో అవకాశాలు వస్తున్న బ్యాటింగ్ లో రాణించలేకపోతున్నాడు. గత ఏడాది జరిగిన మూడు వన్డేలలో కలిపి కేవలం 56 పరుగులు చేసిన మనీష్, ఈ ఏడాది శ్రీలంక టూర్ లో జరిగిన మూడు వన్డే మ్యాచ్ లలో కలిపి కేవలం 74 పరుగులు చేసి అటు భారత క్రీడాభిమానులతో పాటు భారత సెలెక్టర్లను నిరాశపరిచాడు.
ప్రస్తుతం భారత జట్టులో ఉన్న యువ ఆటగాళ్ళతో మిడిల్ ఆర్డర్ లో స్థానం కోసం తీవ్రపోటీ ఉన్న తరుణంలో మనీష్ పాండే కొన్ని అనవసర షాట్స్ కి అవుట్ అవుతుండటంతో పాటు సరైన ఫామ్ లేక సతమతమవుతున్నాడని ఇలా అయితే భవిష్యత్తులో జట్టులో స్థానం సంపాదించడం కూడా కష్టమేనని మాజీ ఓపెనర్ సెహ్వాగ్ తో పలువురు క్రీడా ప్రముఖులు మనీష్ పాండేకి చురకలు అంటించారు. ఇక శ్రీలంక తో జరిగిన వన్డే సిరీస్ లో హార్దిక్ పాండ్య కూడా విఫలం అయ్యాడని ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ వంటి ఆటగాళ్ళు తన మంచి ప్రదర్శన ఇలానే కొనసాగిస్తే జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవచ్చునని క్రీడా పండితులు చెప్పుకొచ్చారు.
ఇక ఆదివారం జరిగిన మొదటి టీ20 లో మొదటి బంతికే అవుట్ అయిన పృథ్వి షా కూడా ఆ మ్యాచ్ మినహా వన్డే సిరీస్ లో రాణించడంతో పాటు శ్రీలంకతో జరగబోయే మిగిలిన రెండు టీ20లో రాణిస్తే భవిష్యత్తులో కూడా మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మనీష్ పాండే తన బ్యాటింగ్ ప్రదర్శన సరిగ్గా లేకపోవడం వల్లే టీ 20 లో స్థానం కోల్పోవడమే అందుకు కారణం. ఇకనైనా తన ఆట తీరు మార్చుకోకపోతే భవిష్యత్తు కష్టమే అని పలువురు సీనియర్ ఆటగాళ్ళు చెప్పకనే చెప్తున్నారు.