WTC 2021-23 సీజన్ పాయింట్ల పద్ధతిలో కీలక మార్పులు
WTC 2021-23: డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో పాయింట్ల పద్దతిలో ఐసీసీ కీలక మార్పులు చేసింది.
WTC 2021-23: డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో పాయింట్ల పద్దతిలో ఐసీసీ కీలక మార్పులు చేసింది. ఇకపై ప్రతిమ్యాచ్‌కు ఐసీసీ 12 పాయింట్లు కేటాయించనుంది. విజయం సాధించిన జట్టుకు ఆ పాయింట్లు మొత్తం వెళ్లనుండగా డ్రా అయితే చెరి రెండు పాయింట్లు, టై అయితే చెరో 6పాయింట్లు పంచనున్నారు. సిరీస్‌తో సంబంధం లేకుండా మ్యాచ్‌ల ఆధారంగానే పాయింట్లు ఉండనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
మరోవైపు కొత్తగా టెస్టు సిరీస్ హోదా పొందిన ఆఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లు ఈ సీజన్‌లో ఫైనల్ ఆడటానికి అర్హత ఉండదని ప్రకటించింది. ఇక స్లో ఓవర్ రేట్‌కు పాయింట్ల కోత కూడా ఉంటుందన్న ఐసీసీ నిర్దారించిన సమయానికి ఓవర్లు పూర్తిచేయకుంటే ఓవర్ల ఆధారంగా పాయింట్ల కోత ఉంటుందని స్పష్టం చేసింది. ఇక త్వరలోనే జరుగనున్న ఐసీసీ ఎగ్జిక్యూటీమ్ సమావేశంలో ఈ నిబంధనలను ఆమోదించనున్నారు.