ICC T20 World Cup : టీమిండియా ముందు భారీ టార్గెట్

Update: 2020-03-08 08:36 GMT
India Vs Aus

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతోంది. ఆస్ట్రేలియా భారత్ ముందు భారీ విజయ లక్ష్యం ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 185 పరుగుల టార్గెట్ ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. తొలి ఓవర్ నుంచి టీమిండియా బౌలర్లపై దాడి చేశారు. అలిసా హేలీ(75 పరుగులు, 39బంతుల్లో, 7 ఫోర్లు, 5 సిక్సులు)తో మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగిపోయింది. ఈ నేపధ్యంలో 30 బంతుల్లో ఆర్థ శతకం నమోదు చేసింది. దీంతో టీ20ల్లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ హేలీ 2,000 పరుగులు పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలో 12 ఓవర్ బాల్ అందుకున్న రాధా యాదవ్, నాలుగో బంతికి అలిసా హేలీ పెవిలియన్ చేర్చింది. యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి వేదా కృష్ణమూర్తి చేతికి దొరికిపోయింది. మరో ఓపెనర్ మూనీ(78, 54 బంతుల్లో, 10 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచింది. టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్ ఉమెన్ గా రికార్డుకు నెలకొల్పింది. కారే(5) నాటౌట్ గా నిలిచింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (16) , హైన్స్‌(2), గార్డ్నర్‌(4), విఫలమైయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (2) వికెట్లు తీయగా, పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. లీగ్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాపై రాణించిన భారత బౌలర్లు ఫైనల్ మ్యాచ్ లో తేలిపోయారు.

  


Tags:    

Similar News