బంతిపై ఉమ్మి రుదోద్ధు.. ఐసీసీ మార్గదర్శకాలు
కరోనా నేపథ్యంలో క్రీడారంగం స్తంభించిపోయింది. తిరిగి క్రికెట్ పోటీలను ప్రారంభించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే.
కరోనా నేపథ్యంలో క్రీడారంగం స్తంభించిపోయింది. తిరిగి క్రికెట్ పోటీలను ప్రారంభించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ ప్రమాదం తగ్గనప్పటికీ క్రికెట్‌ను తిరిగి మైదానానికి తీసుకొచ్చేందుకు ఐసీసీ సిద్ధమైంది. అందరి భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆటను ఆస్వాదించేందుకు గైడ్ లైన్స్ విడుదల చేసింది.
క్రికెట్‌ను 4 దశల్లో సాధారణ స్థితికి తీసుకురావాలని ఐసీసీ స్పష్టం చేసింది. తొలి దశలో ఆటగాళ్లు వ్యక్తిగతంగా శిక్షణ పొందాలి. కసరత్తులు చేయాలి. 2వ దశలో ముగ్గురు కన్నా తక్కువ మంది కలిసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకరినొకరు అస్సలు తాకొద్దు. భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. 3వ దశలో 10 కన్నా తక్కువ మంది కలిసి శిక్షణ, సాధన చేయొచ్చు. నాలుగో దశలో పది కన్నా ఎక్కువ మంది కలిసి నిబంధనలు పాటిస్తూనే శిక్షణ పొందాలి. సాధన చేయాలి. శిక్షణ, గ్రౌండ్ లో జాగ్రత్తలు పాటించాలో ఐసీసీ వివరించింది.
క్రికెట్ గ్రౌండ్ లో ప్రమాదాలు ఉన్నాయి. అందరూ కలిసే ఆడతారు. ఒకరినొకరు తాకడం, వికెట్ పడ్డప్పు దగ్గరికొచ్చి అభినందించుకోవడం చేస్తారు. కూల్ డ్రింక్స్, టోపీలు, తువాళ్లు, మరికొన్ని వసతులను ఆటగాళ్లు కలిసే ఉపయోగించుకుంటారు. మాటిమాటికీ అంపైర్ల వద్దకు వెళ్తారు. బంతికి మెరుపు తీసుకొచ్చేందుకు పదేపదే ఉమ్మి (లాలాజలం) రాస్తారు. ఇవన్నీ వైరస్ వ్యాప్తికి ప్రమాద హేతువులే మరి. ఇక అధికారుల్లో 60 ఏళ్లు పైబడ్డ వారూ ఉంటారు.
ఆటగాడు/అధికారి/సహాయకుడికి కరోనా సోకిందని అనుమానం వస్తే ఎలాంటి నిబంధనలు పాటించాలి. ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు (శిక్షణ లేదా మ్యాచ్ జరిగేటప్పుడు) అవసరమైన గది ఉండాలి. అతడితో సన్నిహితంగా మెలిగిన వారికి పీపీఈ కిట్లు వెంటనే అందించాలి. అనారోగ్యం తీవ్రతను బట్టి ఐసోలేషన్ కాలం నిర్ణయించాలి. వైరస్ నిర్ధారణకు 48 గంటల ముందు ఎవరెవరిని కలిశాడో తెలుసుకోవాలి. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి.
*మైదానంలో, ఆవల ఆటగాళ్లు, అంపైర్లు భౌతిక దూరం పాటించాలి. అనవసర స్పర్శకు గురికావొద్దు.
*ఆట లేదా శిక్షణకు ముందు ఆటగాళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఆటగాళ్లు, సహాయ బృందాలు ప్రమాదం బారిన పడకుండా చూసుకోవాలి. శిక్షణ, ఆట కొనసాగుతున్నప్పుడు అత్యవసర వైద్య సహాయం ఉండాలి.
* ఆటగాడు లేదా సహాయ సిబ్బందికి కొవిడ్-19 సోకితే ప్రత్యేక నిపుణుడితో ఆస్పత్రిలో చికిత్స అందించాలి.
* సబ్బు నీరుతో చేతులు పదేపదే శుభ్రం చేసుకోవాలి. మైదానంలోకి వచ్చినా, డ్రస్సింగ్‌రూమ్‌కు వెళ్లినా కొవిడ్-19 జాగ్రత్తలు పాటించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి.
*బంతిని, క్రికెట్ వస్తువులను ఉపయోగించడంపై ముందుగానే అవగాహన కల్పించాలి. లాలాజలం వాడొద్దని స్పష్టంగా చెప్పాలి.
* ఆట, శిక్షణ సాగుతున్నప్పుడు చికిత్స చేసేందుకు వైద్యుడు సిద్ధంగా ఉండాలి.