డక్‌వర్త్ లూయిస్(డీఎల్‌ఎస్) 'లూయిస్' ఇక లేరు!!
క్రికెట్ చరిత్రలో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్‌ఎస్) అంటే తెలియని అభిమానులు ఎవరూ ఉండరు. వర్షంతోనూ లేక ఏవైనా ప్రతికూల పరిస్థితుల్లో మ్యాచ్ నిలిచిపోతే విజేతను తేల్చే పద్ధతిని డక్ వర్త్ లూయిస్ పద్దతని అంటారు.
క్రికెట్ చరిత్రలో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్‌ఎస్) అంటే తెలియని అభిమానులు ఎవరూ ఉండరు. వర్షంతోనూ లేక ఏవైనా ప్రతికూల పరిస్థితుల్లో మ్యాచ్ నిలిచిపోతే విజేతను తేల్చే పద్ధతిని డక్ వర్త్ లూయిస్ పద్దతని అంటారు.దీనిని కనిపెట్టిన గణాంక నిపుణుల్లో ఒకరైన లూయిస్ కన్నుమూశారు. టోనీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లూయిస్(78) బుధవారం మృతి చెందినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. క్రికెట్‌కు లూయిస్ ఎంతో సేవ చేశారని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్దిస్ అన్నాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టోనీ లూయిస్ మృతి చెందడం విచారణ వ్యక్త చేస్తున్నట్లు ప్రకటించారు. 1997లో ఆయన డక్‌వర్త్‌తో కలిసి డక్‌వర్త్-లూయిస్ విధానాన్ని సృష్టించారు. 1999లో ఐసీసీ ఆ విధానాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది అని ఇంగ్లాండ్ బోర్డు పేర్కొంది. ఈ పద్ధతి మాత్రం 2004 నుంచి అందుబాటులోకి వచ్చింది. డక్‌వర్త్, లూయిస్‌ల రిటైర్మెంట్ తర్వాత స్టీవెన్ స్టెర్న్ఈ విధానానికి పర్యవేక్షుడయ్యాడు. దీంతో పేరును ఐసీసీ 'డక్‌వర్త్ లూయిస్-స్టెర్న్'గా మార్చింది.
ఈ పద్థతి రాకముందు క్రికెట్లో అర్ధంతరంగా ఆగే మ్యాచ్‌ల విజేయతను తేల్చేందుకు ఓ మూస పద్థతి అవలంభించేవారు. అప్పటి దాకా ఆడిన ఓవర్లలో సగటు పరుగుల లెక్కతో విజేతను తేల్చడమో.. లక్ష్యాన్ని నిర్దేశించడమో జరిగేది. 1992లో జరిగిన వరల్డ్ కప్ లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన అప్పటి విధానం పెను విమర్శలకు దారితీసింది.
టోనీ లూయిస్,ఫ్రాంక్ డక్‌వర్త్‌తో కలిసి క్రికెట్లో ఈ పద్ధతిని తెచ్చారు. ఓవర్లు, పరుగులు, రన్ రేట్, కారణంగా అన్నింటిని లెక్కలోకి తీసుకొని విజేయతను ప్రకటిస్తారు. వర్షంతో మధ్యలోనే ఆగిపోయిన ఎన్నో మ్యాచ్‌లకు ఫలితాన్నిచ్చింది. పలు సార్లు ఇదీ విమర్శలకు దారితీసింది.