ఐసీసీ అవార్డులు.. టీమిండియా ప్లేయర్స్ హవా

ఐసీసీ ప్రకటించిన అవార్డులు టీమిండియా ప్లేయర్లు సత్తాచాటారు. భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కు అదుదైన ఈ అవార్డులు దక్కాయి.

Update: 2020-01-15 10:05 GMT
Kohli Rohit

ఐసీసీ ప్రకటించిన అవార్డులు టీమిండియా ప్లేయర్లు సత్తాచాటారు. భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కు అదుదైన ఈ అవార్డులు దక్కాయి. ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, 2019 వన్డేల్లో అత్యధిక స్కోరు నమోది చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు దక్కింది. గతీ ఏడాది వన్డే ప్రపంచకప్ సమయంలో ఆస్ట్రేలియా ప్లేయర్ స్మీత్ ను హేళన చేస్తున్న అభిమానులను కోహ్లీ వారించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ ప్రకటించిన టెస్టుక్రికెట్ అవార్డుల లిస్టులో ఆస్ట్రేలియా ప్లేయర్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ దక్కించుకున్నాడు. గత ఏడాది టెస్టుల్లో 23 ఇన్నింగ్స్‌ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గత సంవత్సరం 28 వన్డేలాడిన రోహిత్ శర్మ 57.30 సగటుతో 1,490 పరుగులు సాధించాడు. ఏడు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఐదు శతకాలు కొట్టాడు. ఇంగ్లాండ్ గడ్డపై ప్రపంచకప్ లో ఐదు శతకాలు బాదిన బ్యాట్స్ మెన్ గా రికార్డుక్కాడు. రోహిత్ శర్మ వన్డేల్లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 1,377 పరుగులతో ఉన్నాడు.

ప్రస్తుతం టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుండగా.. వాంఖేండేలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘోర పరాజయం చూసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. 256 లక్ష‌్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఛేదించింది. వార్నర్ , ఫించ్ అజేయ శతకాలు సాధించారు. ఇక ఈ సిరీస్ రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరగనుంది. 


 

Tags:    

Similar News