గోపీచంద్ అకాడమీ ప్లేయర్లనే టీమిండియాకు ఎంపిక చేస్తారా?
నేపాల్ వేదికగా దక్షిణాసియా గేమ్స్ నిర్వహించనున్నారు. ఆదివారం నుంచి టీమ్ విభాగంలో పోటీలు జరగతున్నాయి డిసెంబర్ 3వతేదీ మంగళవారం నుంచి వ్యక్తిగత విభాగాల్లో క్రీడలు నిర్వహిస్తారు.
నేపాల్ వేదికగా దక్షిణాసియా గేమ్స్ నిర్వహించనున్నారు. ఆదివారం నుంచి టీమ్ విభాగంలో పోటీలు జరగతున్నాయి డిసెంబర్ 3వతేదీ మంగళవారం నుంచి వ్యక్తిగత విభాగాల్లో క్రీడలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రజక్తా సావంత్ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే ఆటగాళ్లను ఏ ప్రాతిపాదికన ఎంపిక చేశారంటూ సెలక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవాళీ టోర్నీల్లో కూడా ఆడని బ్యాడ్మింటన్ ప్లేయర్లను సౌతాసియా గేమ్స్ కు ఎలా ఎంపిక చేశారని మండిపడింది.
ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ట్విటర్ లో బాయ్ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మను నిలదీసింది. సౌతాసియాన్ గేమ్స్ కు ఆడే ప్లేయర్ల జాబితా అధికారికంగా రాకముందే ఎంపిక జరిగిపోయింది. నేపాల్ జరిగే ఈ టోర్నిలో పాల్గొంటున్నామంటూ పులువురు బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజక్తా సావంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆలిండియా టోర్నీల్లోనూ ఆడని వాళ్లను భారత బ్యాడ్మింటన్ జట్టులోకి ఎలా తీసుకుంటున్నారని, గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటేనే ఎంపిక చేస్తారా బాయ్ అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మపై ట్విటర్‌లో ప్రశ్నల వర్షం కురిపించింది. నేషనల్ చాపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసి డబుల్స్ టైటిల్ సాధించింన శిఖా గౌతమ్, అశ్విన్ భట్‌లను దక్షిణాసియా క్రీడలకు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించింది. క్రీడాకారుల ఎంపికలో పక్షపాతం చూపిస్తున్నారని ట్వీట్‌లో పేర్కొంది.
జాతీయ చాంపియన్ జంటకు టీమిండియాలో చోటు దక్కలేదు. అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అంటూ బాయ్ అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మను ప్రశ్నించింది. దీనిపై స్పందించిన హిమంత బిశ్వశర్మ బ్యాడ్మింటన్ ప్లేయర్ల ఎంపికలో ఎలాంటి పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని తెలిపారు. నిబంధనలకు అనుకూలంగా ఆటగాళ్ల ఎంపిక జరిగిందని వెల్లడించారు.
https://t.co/lwNwyj23gM
— prajakta sawant (@prajakta_sawant) November 30, 2019
Injustice against non Gopichand academy players ..in Indian National Badminton Team..@himantabiswa @BAI_Media @RahulGandhi @supriya_sule
This is what Association lies abt the team..
— prajakta sawant (@prajakta_sawant) December 1, 2019
I hope the BAI president and the association have answer for this..@BAI_Media @himantabiswa
Please look into this matter sir @AUThackeray https://t.co/Pq409UKcdC