భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(48)కి శనివారం హార్ట్ ఎటాక్ వచ్చింది. క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతున్నారు. కోల్‌కతాలోని తన నివాసంలో ఈరోజు ఉదయం సౌరవ్ గంగూలీ వ్యాయమం చేస్తుండగా అస్వస్థతకి గురై కిందపడిపోయాడు. దాంతో కోల్‌కతాలోని ఉడ్‌లాండ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఎస్‌కేఎం కార్డియాలజిస్టు డాక్టర్ సరోజ్ మొండల్ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం సౌరవ్ కు కరోనరీ యాంజియోగ్రామ్ నిర్వహిస్తోంది. గుండె రక్తనాళాల్లో పూడికను పరిశీలించనున్నారు.
గంగూలీ త్వరగా కోలుకోవాలని పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీమ్‌ఇండియా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జే షా, మాజీ క్రికెటర్లు సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్‌సింగ్, అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్, గవర్నర్ జగదీప్ ధన్‌కర్ కోలుకోవాలని ప్రార్థించారు. అయితే సచిన్ దాదాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ ఫోటో షేర్ చేశారు. త్వరగా డిశార్జ్ కావాలని ప్రార్థించారు.