Gautam Gambhir About Virat Kohli : అదే కోహ్లీది అత్యుత్తమ రికార్డు : గంభీర్

Gautam Gambhir About Virat Kohli :భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ఎంత చెప్పిన తక్కువే.. క్రికెట్ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే

Update: 2020-08-01 15:31 GMT
Gautam Gambhir ,Virat Kohli(File Photo)

Gautam Gambhir About Virat Kohli :భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ఎంత చెప్పిన తక్కువే.. క్రికెట్ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ బాట్స్ మెన్ గా ఎదిగాడు. అండర్‌ 19 స్థాయిలోనే టీమ్‌ఇండియాను విశ్వవిజేతగా నిలిపిన కోహ్లి ఆ తర్వాత జాతీయ జట్టులో స్థానం సంపాదించి మామూలు ఆటగాడి నుంచి ఏకంగా జట్టు కెప్టెన్ గా అవతరించాడు. ప్రత్యర్ధి ఎవరైనా, ఫార్మాట్‌ ఏదైనా సరే పరుగుల మోత మోగించడం కోహ్లికి తెలిసిన పని.. కెప్టెన్ గా, ఆటగాడిగా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. శతకాలతో ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. అయితే కోహ్లి 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 183 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.. ఇదే కోహ్లి త్యధిక వ్యక్తిగత స్కోర్‌ కూడా.. అయితే తాజాగా దీనిపైన ఇండియన్ మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు.

తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌ కార్యక్రమంలో మాట్లాడిన ఈ మాజీ ఆటగాడు అప్పుడు కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ను ప్రశంసించాడు. ఇక నమ్మశక్యం కానీ ఎన్నో ఇన్నింగ్స్‌ లను గంభీర్ ఆడాడని, అందులో ఇది ప్రత్యేకమైనదని అభిప్రాయపడ్డాడు. అప్పట్లో అంత అనుభవం లేకపోయిన సరే పాక్ పైన బాగా ఆడాడని మెచ్చుకున్నాడు. ఇక ఆ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ కి దిగిన పాక్ నిర్ణిత 50 ఓవర్లలో ఆరు వికెట్లకి 329 పరుగులు చేసింది. పెనర్లు మహ్మద్‌ హఫీజ్‌(105), జాసిర్‌ జంషెద్‌ (112) శతకాలతో చెలరేగారు. ఇక ఆ తర్వాత టీం ఇండియా జట్టు కేవలం నాలుగు వికెట్లను కోల్పోయి 47.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేధించింది.  

Tags:    

Similar News