న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది . అ సంఘటన ఆటగాళ్ళుని నవ్వులు పూయించింది . ఇంతకి అ సంఘటన ఏంటంటే ... లంక స్పిన్నర్ లసిత్ ఎమ్బుదినియా 82వ ఓవర్ వేస్తున్న సమయంలో ట్రెంట్‌బౌల్ట్ క్రీజులో ఉన్నాడు. బౌల్ట్ స్వీప్ షాట్ ఆడుతుండగా అది హెల్మెట్‌లోని గ్రిల్స్‌కు తగిలి అక్కడే ఉండిపోయింది . దీనితో బాల్ ఎక్కడ పోయింది అన్న అయోమయంలో పడ్డారు లంక బౌలర్లు . బంతి బౌల్ట్ హెల్మెట్ లోపల అలానే ఉండిపోవడంతో లంక క్రికెటర్లు బౌల్ట్ వెనుక పడడం మొదలు పెట్టారు . ఒకానొక దశలో బౌల్ట్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. దీనిని ఐసీసీ 'కాట్ అండ్ బౌల్ట్' అంటూ సరదాగా ట్వీట్ చేసింది. అయితే దీనిపైన ఓ నెటిజన్ స్పందిస్తూ "బౌల్ట్ అది యాపిల్ కాదు క్రికెట్ బంతి నువ్వు పొరబడ్డావు దాన్ని తినొద్దు" అంటూ పోస్ట్ పెట్టాడు ..
Caught and Boult 😆 pic.twitter.com/N6Pbjs4UzI
— ICC (@ICC) August 15, 2019