IPL 2025: ఫ్యాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ఐదుగురు స్టార్ ప్లేయర్లు.. వేరే జట్టుకు జంపింగ్.. లిస్టులో రోహిత్, రాహుల్
IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మెగా వేలం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంకా నిబంధనలను విడుదల చేయలేదు.
IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మెగా వేలం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంకా నిబంధనలను విడుదల చేయలేదు. అలాగే రిటెన్షన్ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇదిలావుండగా, చాలా జట్లకు సంబంధించి నివేదికలు వచ్చాయి. కొంతమంది ఫ్రాంఛైజీలు రిటెన్షన్ గురించి ఓ కొలిక్కి వచ్చాయి. కొన్ని జట్లు ఇంకా ఆలోచిస్తున్నాయి. BCCI రైట్ టు మ్యాచ్‌తో సహా తమ ప్రస్తుత జట్టులో గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను అనుమతించాలని కోరుకుంటున్నాయి. అయితే కొన్ని జట్లు 8 మంది ఆటగాళ్లను ఉంచుకోవాలని భావిస్తున్నాయి. అయితే, ఇతర జట్లకు జంప్ చేయగల ఐదుగురు స్టార్ ప్లేయర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిత్ శర్మ: ఈ జాబితాలో అతిపెద్ద పేరు రోహిత్ శర్మ. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ ముంబై జట్టు నుంచి విడిపోవచ్చు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. IPL 2025 సీజన్‌లో రోహిత్ కొత్త జట్టు కోసం ఆడే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇంకా అందలేదు. కొన్ని మీడియా కథనాలలో రోహిత్ జట్టులోనే ఉంటాడని, కొన్నింటిలో మాత్రం అతను ఫ్రాంచైజీని విడిచిపెడతాడని వార్తలు వినిపిస్తున్నాయి.
కేఎల్ రాహుల్: లక్నో సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్న విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ ఆట తీరు, కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ బ్యాట్స్‌మెన్ ఇప్పుడు భారత టీ20 జట్టులో సభ్యుడు కూడా కాదు. రాహుల్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరపున ఆడాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే లక్నో కొత్త కెప్టెన్‌ను వెతుక్కోవలసి ఉంటుంది.
ఫాఫ్ డు ప్లెసిస్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ గత సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న అతను టీ20లో మునుపటిలా నిలకడగా లేడు. అతను కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే బాగా ఆడగలడు. ఇటువంటి పరిస్థితిలో, RCB అతనిని తన జట్టు నుంచి తొలగించగలదు. అతని స్థానంలో ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్‌ని ఎంచుకోవచ్చు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ పేరు ముందు వరుసలో ఉంది.
వెంకటేష్ అయ్యర్: ఐపీఎల్ గెలిచిన తర్వాత, కోల్‌కతా నైట్ రైడర్స్ తమ ఐదు లేదా ఆరుగురు ఆటగాళ్లను వేలానికి ముందు ఎంపిక చేయడం చాలా కష్టమైన పని. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, మిచెల్ స్టార్క్, శ్రేయాస్ అయ్యర్, ఫిల్ సాల్ట్ ఫ్రాంచైజీకి ఎంపిక కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకటేష్ అయ్యర్ జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది.
గ్లెన్ మాక్స్‌వెల్: IPL 2024 సీజన్‌లో RCB తరపున పేలవమైన ప్రదర్శన చేసిన గ్లెన్ మాక్స్‌వెల్ కూడా జట్టును విడిచిపెట్టవచ్చు. అతని కోసం ఫ్రాంచైజీ రూ.14.25 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు జట్టు ఇదే డబ్బును వేరే ఆటగాడి కోసం వెచ్చించాలనుకుంటోంది. మాక్స్‌వెల్ వచ్చే ఏడాది కొత్త జట్టులో ఆడటం చూడవచ్చు.