Sania Mirza Responds to Babar Azam Comments: బాబర్ నిన్ను చంపేస్తా.. పాక్ క్రికెట్ జట్టు సారథిపై సానియా ఆగ్రహం
Sania Mirza Responds to Babar Azam Comments: పాకిస్తాన్ టీ20, వన్డే జట్టు కెప్టెన్ టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌కు భారత టెన్నిస్ స్టార సానియా మీర్జా వార్నింగ్ ఇచ్చారు.
Sania Mirza Responds to Babar Azam Comments: పాకిస్తాన్ టీ20, వన్డే జట్టు కెప్టెన్ టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌కు భారత టెన్నిస్ స్టార సానియా మీర్జా వార్నింగ్ ఇచ్చారు. సానియా భర్త పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో బాబర్ అజామ్ మాట్లాడుతుండగా.. ఇలా సానియా నుంచి హెచ్చరిక చేసింది పాకిస్తాన్ జట్టు మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ కోసం ఆదివారం ఇంగ్లండ్ టూర్ కి వెళ్లనుంది. ఈ సందర్భంగా కెప్టెన్ బాబర్ అజామ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో షోయబ్ మాలిక్‌తో మాట్లాడాడు. మాలిక్ అడిగిన పలు ప్రశ్నలకి బాబర్ అజమ్ సమాధానాలు ఇస్తూ వస్తున్నాడు. మాలిక్ పర్సనల్ విషయాల గురించి ప్రశ్నలు వేసాడు. పాక్ క్రికెట్ జట్టులోని క్రికెటర్ల కుటుంబాలతో నీకు మంచి అనుబంధం ఉంది కదా...బాబర్ అని మాలిక్ అడిగాడు.. అవును అని కెప్టెన్ బాబర్ బదులిచ్చాడు.
అయితే నీకిష్టమైన వదిన ఎవరు? అని బాబర్ ఆజమ్‌ను షోయబ్ మాలిక్ ప్రశ్నించాడు. బాబర్ ఏమాత్రం ఆలోచించకుండా.. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ భార్య సైదా ఖుస్బత్ అని మాలిక్ తో చెప్పాడు. సానియా మీర్జాతో బాబర్ కి మంచి స్నేహం ఉంది. ఈ కారణంగా ఆమె పేరుని చెప్తాడని ఊహించిన మాలిక్‌కి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇక లైవ్ చూస్తున్న సానియా.. ఐ విల్ కిల్ యూ అని మెసేజ్ పెట్టారు. ఇక నుంచి షోయబ్ ఇంటిలోని వస్తే కూర్చోమని కూడా చెప్పను అని బాబర్‌పై సానియా చిరుకోపాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది.