Corona Effect: భారత్ ను చూసి బుద్ధి తెచ్చుకోండి : షోయబ్ అక్తర్
కరోనా వైరస్ వలన ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు చాలానే శ్రమిస్తున్నాయి.
కరోనా వైరస్ వలన ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు చాలానే శ్రమిస్తున్నాయి. కానీ క్రమక్రమంగా ఈ వైరస్ ప్రభావం వలన చాలా మంది చనిపోతున్నారు. దీనికి మెడిసిన్ కనిపెట్టే క్రమంలో శాస్త్రవేత్తలు ఉండగా, ప్రస్తుతం నివారణ చాలా ముఖ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. అందులో భాగంగానే నిన్న (ఆదివారం) భారత ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. ఇందులో 130 కోట్ల భారతీయులు పాల్గొని జనతా కర్ఫ్యూనీ విజయవంతం చేశారు..
అయితే దీనిపై ఆయన పరోక్షంగా స్పందించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ పాక్ ప్రజల్లో అవగాహన లేదని, ప్రభుత్వం కూడా ఆలక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించాడు. షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ.." నిన్న అత్యవసర పరిస్థితి పైన నేను బయటికి వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడ నేను ఎవరికీ ఇవ్వలేదు. అలా అని హగ్ కూడా ఎవరికీ ఇవ్వలేదు. నా ప్రయాణం మొత్తం కారు అద్దాలను మూసేసి ఉంచాను.
కానీ బయట పరిస్థితులు మాత్రం నేను గమనించాను. ఓకే బైక్ పైన నలుగురు వెళ్ళడం, రోడ్డుపైన భోజనాలు చేయడం, సెలవు దొరకడంతో విహార యాత్రకు వెళ్ళడం గమనించాను.. ఇలా గుంపులు గుంపులుగా కలిస్తేనే వైరస్ సోకుతుంది. దీనిపైన భారత్ రక్షణాత్మక చర్యలు తీసుకుంటుంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఆలక్ష్యంగా వ్యవహరిస్తుందని, దీని వల్ల దేశానికి ప్రమాదకరమని" షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు..
చైనాలో మొదలైన ఈ కరోనా వైరస్ క్రమ క్రమంగా ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. దాదాపుగా 180 దేశాలకు పైగా వ్యాపించిన ఈ వైరస్ వలన 13 వేల మంది మరణించారు. ఇక పాకిస్తాన్ లో 700 కరోనా కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది..