పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారాన్ని ఆయన తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత గురువారం నుంచి తనకి ఆరోగ్యం బాగోలేదని వెల్లడించిన అఫ్రిది.. పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని చెప్పుకొచ్చాడు.
అఫ్రిదికి కరోనా సోకడంతో ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. మరో ఇద్దరు క్రికెటర్లు తౌఫీర్ ఉమర్, జఫర్ సర్ఫరాజ్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పాక్ క్రికెట్‌లో కరోనా కలకలం రేపింది.