పుల్లెల గోపీచంద్ : ఆటగాడిగా.. కోచ్‌గా ఉన్నత శిఖరం
తెలుగు తేజం భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు.
తెలుగు తేజం భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. ఆటగాడిగా దేశ ఖ్యాతిని నలుదిశలు చాటాడు. అలాగే కోచ్‌గాను విశేష సేవలందింస్తున్నారు. భారత దేశంలో క్రికెట్‌కు అభిమానించే వారికి సైతం బ్యాడ్మింటన్ అంటే మొదట గుర్తువచ్చేది గోపించద్‌నే. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా గోపిచంద్ నిలిచాడు. ఆ తర్వత దేశంలోనే బెస్ట్ కోచ్ గాను మన్ననలు పొందాడు. గోపిచంద్ ప్రతిభను గుర్తిచింన భారత్ ప్రభుత్వం అతడిని అర్జున అవార్డు, ద్రోణాచార్య, పద్మ భూషణ్ అవార్డులతో గౌరవించింది.
బ్యాడ్మింటన్‌లో గోపించంద్ మొదటి గురువు హమీద్ హుస్సేన్. ఆతరువాత అరీఫ్, ప్రకాష్ పడుకొనె, గంగూలీ ప్రసాద్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. వారి వద్ద ఎన్నో మెలుకువలు నేర్చుకున్నారున్నారు. బ్యాడ్మింటన్ తెలియని చిన్నతనంలో ఆసక్తిని కల్పించి ఆటనెర్పిన గురువు హమీద్ హుస్సేన్ గురించి గోపించంద్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. 1980వ దశకంలో ప్రకాశ్ పడుకొనే ఆల్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించాడు. అయితే అతని వద్ద ఎన్నో మెలుకువలు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ మెడల్స్ సాధించాడు. 2001లో చైనాకు చెందిన చెన్ హాంగ్‌ను ఓడించి ఈ ఘనత సొంతం చేసుకున్న విషయం తెలిసిందే
ఐఐటీ కాన్పూర్ 2019 జూన్‌లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆటగాడిగా విరామం తీసుకున్నాక హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో నెలకొల్పాడు. 2వేల మంది క్రీడాకారులు గోపిచంద్ వద్ద శిక్షణ పొందారు. క్రీడా ప్రపంచానికి పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, కశ్యప్ సైనా నెహ్వాల్, ను పరిచయం చేశారు. అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలకి ఏమాత్రం తీసిపోని విధంగా అకాడమీని గోపీచంద్ నడిపిస్తున్నారు.
గోపిచంద్ వక్తిగత విషయాలు చూస్తే అతను 1973 నవంబర్ 16 న ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో పుట్టిన గోపి నాగండ్లలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ప్రోత్సహించే వారు తల్లి సుబ్బరావమ్మ తోడ్పాటు ఉందచి ఆటగాడిగా ఉన్నప్పుడు అండగా నిలవడంతోపాటు, కోచ్ గా ఉన్నప్పుడు మద్దతునిచ్చింది. అడ్మిషన్లు, అకౌంట్స్ అన్ని తల్లి సుబ్బరావమ్మ చూసుకునేది. గోపిచంద్ భార్య లక్ష్మీకూడా ఎంతగానో ప్రోత్సహించేది. గోపించంద్ కు ఇద్దరు పిల్లలు కుమార్తె గాయత్రి, కుమారుడు సాయి విష్ణు కూడా క్రీడల్లో రాణిస్తున్నారు. గోపిచంద్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
KeyWords: former Indian badminton player, Pullela Gopichand, 46th birthday, Pullela Gopichand Birthday, Sports