వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ మరోసారి నిరాశ పరిచాడు. 19 పరుగులు చేసిన గుప్తిల్ - వోక్స్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ రెండో బంతికి ఎల్బీ అయ్యాడు. న్యూజిలాండ్ సమీక్ష కోరినప్పటికీ లాభం లేకపోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ నిదానంగా సాగుతోంది. తొమ్మిది ఓవర్లకు ఒక్క వికెట్ కోల్పోయి 33 పరుగులు చేసింది న్యూజిలాండ్. నికోలస్ 10 పరుగులతోనూ, విలియమ్సన్ ఒక్క పరుగుతోనూ క్రీజులో ఉన్నారు.