కంగారు పడుతున్న కివీస్.. 10 ఓవర్లకు 27/1

Update: 2019-07-09 10:17 GMT

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ లో భాగంగా భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి సెమిస్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు తడబడుకుంటూ ఆడుతుంది . మొదటి పది ఓవర్లకు గాను న్యూజిలాండ్ జట్టు ఒక వికెట్ కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది . భారత్ బౌలర్ల ధాటికి కివీస్ పరుగులు రాబట్టడం కష్టతరంగా సాగుతుంది . అయితే న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి .. బుమ్రా వేసిన 3.3 వ బంతికి మార్టిన్‌ గప్తిల్‌ (1; 14 బంతుల్లో) ఔటయ్యాడు. స్లిప్‌లో దానిని కోహ్లీ అద్భుతంగా పట్టుకున్నాడు .. ప్రస్తుతం క్రీజ్ లో విలియమ్సన్‌ (14), నికోల్స్‌ (10) ఉన్నారు ..  

Tags:    

Similar News