Virat Kohli: 'విరాట్ కోహ్లీ మ్యాచ్ ఓడిన తరువాత బెయిల్స్ టచ్ చేయడం చూసి చాలా బాధపడ్డాను'..

Virat Kohli: విరాట్ కోహ్లి... భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటాడు. ఐపీఎల్ 2024 లో భాగంగా మే 22న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఓటమి పాలైంది.

Update: 2024-05-23 07:53 GMT

Virat Kohli: 'విరాట్ కోహ్లీ మ్యాచ్ ఓడిన తరువాత బెయిల్స్ టచ్ చేయడం చూసి చాలా బాధపడ్డాను'..

Virat Kohli: విరాట్ కోహ్లి... భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటాడు. ఐపీఎల్ 2024 లో భాగంగా మే 22న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఓటమి పాలైంది. ఈ సమయంలో విరాట్ కోహ్లి మైదానంలో కన్పించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతిలో ఓటమి పాలైన తర్వాత ఆర్ సీ బీ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్లపై ఉన్న బెయిల్స్ ను తొలగిస్తుండడం కెమెరాల్లో రికార్డైంది. ఈ సమయంలో ఆయన ముఖంలో బాధ కన్పించింది. ఈ ఓటమితో ఆర్ సీ బీ జట్టు ఐపీఎల్ 2024 నుండి నిష్క్రమించింది.

"ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ బెయిల్స్ ను తీయడం అంతులేని కథ" అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. "విరాట్ తన చేతులను స్టంప్‌లపై మృదువుగా రుద్దడం, బెయిల్స్ ను తీయడం ఈ రాత్రి నాకు అత్యంత హృదయ విదారకమైన విషయం" అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు. ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో భారత్ ఓడిపోయిన తర్వాత కోహ్లీ బెయిల్స్ ను తొలగించారు.

“విరాట్ కోహ్లి మ్యాచ్ చివరిలో బెయిల్స్ తొలగించడం జట్టు ఓటమిపై ఆయన బాధను వ్యక్తం చేస్తుందని మరొకరు వ్యాఖ్యానించారు. టోర్నీ మొత్తం కోహ్లి బాగా ఆడాడు. నిజానికి ప్రపంచకప్‌లో నిలకడగా ఆడిన ఏకైక భారత ఆటగాడు అతడే'' అంటూ ఆయన కితాబిచ్చారు.

విరాట్ కోహ్లి: ఐపీఎల్ లో 8 వేల పరుగులు

ఆర్ సీ బీ జట్టు సభ్యుడిగా ఉన్న విరాట్ కోహ్లి 15 మ్యాచుల్లో 741 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 154. మే 22న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి అరుదైన రికార్డుకు చేరుకున్నారు. ఐపీఎల్ లో 8 వేల పరుగులు చేశారు. ఐపీఎల్ లో 8 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లినే.విరాట్ కోహ్లి తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్ నిలిచారు.ఇప్పటివరకు 6769 పరుగులు చేశారు శిఖర్ ధావన్.ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా నిలిచారు.

తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు ఐపీఎల్ 2024 నుండి నిష్క్రమించడంపై కోహ్లి కూడా తట్టుకోలేకపోయారు. కోహ్లిని ఆ పరిస్థితుల్లో చూసిన నెటిజన్లు అత్యంత బాధాకరమైన విషయంగా చెబుతున్నారు.

Tags:    

Similar News