వరల్డ్ కప్ క్రికెట్ 2019 తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ అదరగొట్టింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. 312 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా 39.5 ఓవర్లలోనే 207 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో మొదటి మ్యాచ్ ను గెలిచి ఇంగ్లాండ్ టోర్నీలో శుభారంభం చేసింది.
312 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలను 39.5 ఓవర్లకు 207 పరుగులకే కుప్పకూల్చింది. క్వింటన్ డికాక్ (68; 74 బంతుల్లో 6×4, 2×6), రసీ వాన్‌డెర్ డసెన్ (50; 61 బంతుల్లో 4×4) మినహా మరెవ్వరూ రాణించలేదు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో అదరగొట్టాడు. లియామ్ ప్లంకెట్, బెన్‌స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు.