జేమ్స్ యూఆర్ అన్‌లక్కీ.. ఇలాంటి ఔట్ ఎప్పుడు చూడలేదు !
దురదృష్టం వెంటాడుతుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి. అలానే ఉంది జేమ్స్ విన్సే పరిస్థితి.
దురదృష్టం వెంటాడుతుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి. అలానే ఉంది జేమ్స్ విన్సే పరిస్థితి. బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్-మెల్‌బోర్న్ రెనిగెడ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే జరిగింది. జేమ్స్ విన్సే అవుట్ కావాలని, బౌలర్, ఫిల్డార్, తొటి బ్యాట్స్ మెన్ కాదు విధి డిసైడ్ చేసింది. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ సిక్సర్స్-మెల్‌బోర్న్ రెనిగెడ్స్ మ్యాచ్ లో ఎవరు ఊహించని ఘటన చోటు చేసుకుంది. మెల్‌బోర్స్ జట్టు బౌలర్ విల్ సదర్లాండ్ విసిరిన బాల్‌ను సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ జోష్ ఫిలిప్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. దీంతో ఆ బంతి బౌలర్ విల్ సదర్లాండ్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అనూహ్యంగా ఆ బంతి కాస్తా నాన్‌స్ట్రయిక్‌లో వికెట్లకు తాకింది. అప్పటికే రన్ కోసం రెడీగా ఉన్న నాన్‌స్ట్రయికర్ జేమ్స్ విన్సే అనూహ్యంగా రనౌట్‌గా వెనుదిరిగాడు.
కాగా.. మెల్‌బోర్స్ జట్టు సంబరాలు చేసుకోవడం చూసిన ప్రేక్షకులకు ఏం అర్ధం కాలేదు. అయితే రిప్లైలో క్లియర్‌గా చూశాక జేమ్స్‌విన్సే జీర్ణించుకోలేక దురదృష్టం తానే తిట్టుకుంటు పెవిలియన్ బాటపట్టాడు. ఈ మ్యాచ్‌లో 13 బంతుల్లో 22 పరుగులు చేసిన జేమ్స్ అనూహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ రనౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీబీఎల్ ఈ వీడియోను ట్విటర్ లో పెట్టింది. జేమ్స్ విన్సే అన్ లక్కి అవుట్ అంటూ క్యా్ప్షన్ పెట్టింది. దీనిపై ఓ నెటిజన్ ఫన్నీ బీబీఎల్‌లో విన్సే దురదృష్టం వెంటాడుతుందని కామెంట్ పెట్టాడు.
మెల్‌బోర్న్ రెనిగెడ్స్ ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి ఐదు వికెట్లు నష్టానికి 175 పరుగులు చేసింది. మెల్ బోర్న్ రెనిగెడ్స్ ఆటగాడు ఆరోన్ ఫించ్ 68 బంతుల్లో109 పరుగులు చేశాడు. టామ్ కూపర్ 24 పరుగలు చేశాడు. 176 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది స్టివ్ స్మిత్ 40 బంతుల్లో 66 పరుగులు , ఫిల్ప్సీ 42 బంతుల్లో 61 పరుగులు చేశాడు.
Could James Vince BE any more unlucky?? 😱#BBL09 pic.twitter.com/fJDssdx2FA
— KFC Big Bash League (@BBL) January 25, 2020