మాది కూడా సరైనా గెలుపు కాదు ..ఇయాన్ మోర్గాన్

Update: 2019-07-20 08:53 GMT

తాజాగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రతి ఒక్క క్రీడా అభిమానికి గుర్తుండే ఉంటుంది . అలాంటి మ్యాచ్ ఇంకెప్పుడు మనం చూడం, చూడలేం అని చాలా మంది చెప్పుకొచ్చారు . ఇందులో ఇంగ్లాండ్ జట్టుతో చివరి వరకు పోరాడి ఐసీసీ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ నే కప్ వరిచింది . అయితే దీనిపైన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు . టైం మ్యాగిజీన్ తో మాట్లాడుతూ ఫైనల్ ఫలితాన్ని బౌండరీల ఆధారంగా నిర్ణయించడం సరికాదని చెప్పుకొచ్చాడు . ఇలాంటి ఓటమిని కూడా ఎవరు జీర్ణించుకోలేరని మోర్గాన్ అన్నాడు . దీనిపైన కెప్టెన్ విలియమ్సన్ తో కూడా మాట్లాడానని మోర్గాన్ చెప్పుకొచ్చాడు . 

Tags:    

Similar News