సౌత్ ఆఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే జట్టుకు సీనియర్ ఆటగాడిగా అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. నేను తీసుకున్న అతి కష్టమైన నిర్ణయాలలో ఇది ఒకటని అభిప్రాయపడ్డాడు. ఇక జట్టుకు ప్రాతినిధ్యం వహించడంలో మరియు నడిపించడం నాకు లభించిన గొప్ప గౌరవమని డుప్లెసిస్ అన్నాడు. జట్టు కొత్త నాయకత్వంలో మరింత ముందుకు వెళుతుందని ఆశించే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
ఇక జట్టు పగ్గాలను డీకాక్ తీసుకున్నాడు. డుప్లెసిస్ కెప్టెన్సీ పగ్గాలను వదులుకున్న విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన ట్వీటర్ అకౌంట్‌లో పేర్కొంది. ఇక గత ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో డుప్లెసిస్ సారధ్యంలోని సౌత్ఆఫ్రికా ఓడిపోయింది. ఆ తర్వాత భారత్ తో జరిగిన ఓ టెస్ట్ సిరీస్ 3-1తో పరాజయం పాలైంది . దీనితో డుప్లెసిస్ పై ఒత్తిడి ఏర్పడింది. ఈ నేపధ్యంలో విమర్శలు రాకముందే కెప్టెన్సీ భాద్యతల నుంచి తప్పుకున్నాడు.
BREAKING!
— ICC (@ICC) February 17, 2020
Faf du Plessis has announced he is stepping down as South Africa captain from all formats! pic.twitter.com/ukBYGgduiX
ఇక ఇది ఇలా ఉంటే ఈనెల 21 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఈరోజు 16 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. ఈ సిరీస్ అనంతరం సఫారీ టీం మార్చి 12 నుంచి భారత్ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌ని ఆడనుంది.
దక్షిణాఫ్రికా టీ20 జట్టు:
డికాక్ (వికెట్ కీపర్/కెప్టెన్), తెంబ బవుమా, డుప్లెసిస్, దుస్సేన్, డేవిడ్ మిల్లర్, బిల్జన్, ప్రిటోరియస్, పెహ్లుక్వాయో, స్మట్స్, కగిసో రబాడ, షంసీ, లుంగి ఎంగిడి, ఫార్చూన్, నోర్తేజ్, డేల్ స్టెయిన్, హెన్రిచ్ క్లాసెన్డుప్లెసిస్ సంచలన నిర్ణయం