ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ కథ ముగిసింది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. దీంతో రేసు నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రహనే, లివింగ్ స్టోన్‌లు ఆదిలోనే అవుట్ అయ్యారు. సంజూ శాంసన్ రనౌట్ కావడంతో పాటు, లామ్రోర్ కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి బంతి వరకూ క్రీజ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రియాన్ పరాగ్(50; 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పృథ్వీషా(8), శిఖర్ ధావన్(16)లు ఆదిలోనే పెవిలియన్ చేరారు.
దీంతో ఢిల్లీ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో శ్రేయస్ అయ్యర్-రిషభ్ పంత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరు 33 పరుగులు జత చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్(15) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. కాసేపటికి ఇన్‌గ్రామ్(12) కూడా ఔట్ కావడంతో మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లి బాధ్యతను రిషభ్ తీసుకున్నాడు. రిషభ్ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ 16.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఇక ఈ ఓటమితో రాజస్థాన్ ఈ ఐపీఎల్ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది.