రూటు మార్చిన ధోని..
ధోని మరో అవతారమెత్తనున్నారు. క్రీడా ప్రపంచం గుర్వించేలా భారత క్రికెట్‌కు ఎంతో విశేష సేవలందించిన టీమిండియా మాజీ సారథి మిస్టర్ కూలీ ధోని
ధోని మరో అవతారమెత్తనున్నారు. క్రీడా ప్రపంచం గుర్వించేలా భారత క్రికెట్‌కు ఎంతో విశేష సేవలందించిన టీమిండియా మాజీ సారథి మిస్టర్ కూలీ ధోని. ఇండియన్ ఆర్మీపై తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు. కాగా.. ధోని వన్డే ప్రపంచ కప్ తర్వాత నుంచి టీమిండియాలో ఆడలేదు. క్రికెట్‌కు దూరంగా ఉంటువచ్చాడు. ఆ తర్వాత బ్యాట్ పట్టలేదు. రెండు నెలల పాటు భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేశారు.
తాజాగా ధోని భారత సైనికుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. రెండు నెలల పాటు సైన్యంలో పనిచేసిన ధోని వారి సమస్యలపై అవగాహన ఏర్పాటు చేసుకున్నారు. సైన్యం చేరిన వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలియజేసేందుకు ఓ కార్యక్రమాన్ని నిర్మించేందుకు పునుకున్నారు. భారత మిలటరీ దళల పనితనాన్ని దేశం కోరు వారు పాటుపడుతున్న విధానాన్ని అందరికీ తెలియచేసేలా షో నిర్మించనున్నారు. భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని ధోని పొందిన సంగతి తెలిసిందే. ధోని రూపొందించే ఈ కార్యక్రమం స్టార్ ప్లస్‌లో ఈ షో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. షో ప్రారంభం కాకముందే ఈ న్యూస్ వైరల్ గా మారింది.
గత కొంత కాలంగా ధోని క్రికెట్ దూరంగా ఉన్నారు. అతను చివరి వన్డే జూలైలో న్యూజిలాండ్ పై ఆడాడు. ఆ తర్వాత ధోని పునరాగమనం చేయలేదు. జట్టులోకి పునరాగమంపై ప్రశ్నించగా జనవరి వరకూ ఓపిక పట్టాలని అప్పటి వరకూ ఏమి అడగవద్దని కోరారు. 350 వన్డే మ్యాచులు ఆడిన ధోని పదివేల పైచిలుకు పరుగులు సాధించాడు. 98టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. ధోని తన చివరి టీ20 మ్యాచ్ ఆస్ట్రేలియాపై 2019 ఫిబ్రవరిలో ఆడారు. ఈ నేపథ్యంలో ధోని షో నిర్వహిస్తున్నారన్న టాక్ వైరల్ గా మారింది. ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.