మ్యాచ్ లో ఇప్పుడు అతనే కీలకం ..

Update: 2019-07-10 11:04 GMT

న్యూజిలాండ్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో భారత్ నాలుగు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది ..రోహిత్ , కోహ్లి, రాహుల్ ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు . ఇక కొద్దిసేపు నిలకడగా ఆడినట్టే కనిపించిన దినేష్ కార్తీక్ కూడా తక్కువ పరుగుల వ్యవదిలోనే అవుట్ అయ్యాడు .. ప్రస్తుతం భారత్ పన్నెండు ఓవర్లకు గాను 36 పరుగులు చేసింది . ఇప్పుడు క్రీజ్ లో రిషబ్ పంత్ మరియు పాండ్యా ఉన్నారు . ఇప్పుడు ఇండియన్ ఫాన్స్ మరియు టీం కూడా ఒకే ఒక్కరిని నమ్ముకుంది . అతనే ధోని .. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ధోని నిలబడి ఇండియాకి చాలా సార్లు విజయాన్ని కట్టబెట్టాడు .. 2011 ప్రపంచ కప్ లో భాగంగా అద్బుతంగా ఆడి భారత్ ని విజయతీరాలకు నడిపించాడు ధోని .. ప్రస్తుతం ధోని చెప్పుకోదగ్గ ఫార్మ్ లో లేనప్పటికీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ధోని ఆదుకుంటాడని ఫ్యాన్స్  కోరుకుంటున్నారు .. 

Tags:    

Similar News