ముగిసిన ధావన్ పోరాటం

Update: 2019-06-09 12:15 GMT

ధావన్‌(117; 109బంతుల్లో) పోరాటం ముగిసింది. స్టార్క్‌ బౌలింగ్‌లో 37ఓవర్‌ చివరి బంతిని భారీ షాట్‌ ఆడిన గబ్బర్‌ బౌండరీలైన్‌ వద్ద లయాన్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతం భారత్‌ 37ఓవర్లకి 220/2తో ఉంది. కోహ్లీ 45  పరుగులతో అర్థ సెంచరీ వైపు దూసుకు వెళుతున్నాడు. భారత్ జట్టు పరుగులు నిలకడగా వస్తున్నాయి. 38 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 225  పరుగులు చేసింది. పాండ్య 1 పరుగుతో కోహ్లీ కి జతగా ఆడుతున్నాడు. 


Tags:    

Similar News