ఐపీఎల్ 10వ రౌండ్ పోటీకి న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ , కింగ్స్ పంజాబ్ జట్లకు కీలకంగా మారింది. హోంగ్రౌండ్ వేదికగా ఆడిన గత నాలుగుమ్యాచ్ ల్లో మూడు పరాజయాలు పొందిన ఢిల్లీజట్టు ఆరునూరైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకూ ఆడిన మొత్తం తొమ్మిదిరౌండ్ల మ్యాచ్ ల్లో రెండుజట్లు ఐదు విజయాలు, నాలుగు పరాజయాల రికార్డుతో ఉన్నాయి. రషబ్ పంత్, రబాడా ఢిల్లీకి స్టార్ ప్లేయర్లుగా ఉంటే పంజాబ్ కు అశ్విన్, రాహుల్ , గేల్ తురుపుముక్కలుగా ఉన్నారు. టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని 160కి పైగా స్కోరు సాధించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి.