ఐపీఎల్-2020లో ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. గత 13 సీజన్లుగా ఒక్కసారి కూడా ఫైనల్ చేరని ఢిల్లీ జట్టు ఈ ఏడాది ఆ ఆశ తీర్చకుంది. ఆల్‌రౌండ్ షోతో ఢిల్లీ అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన క్వాలిఫయిర్-2 మ్యాచ్ లో హైదరాబాద్‌ను 17 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. లీగ్ చరిత్రలో తొలిసారిగా తుదిపోరుకు చేరింది. ఐపీఎల్–13లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ముగిసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. చివర్లో కొద్దిగా తడబడినా మూడు వికెట్లు కోల్పోయి 189 పరుగులు సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ప్రారంభం నుంచే తడబడింది. మొదటి నాలుగు వికెట్లను కోల్పోయినా తర్వాత కేన్ విలియమ్సన్ ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రబాడా వరుసగా మూడు వికెట్లి తీసి ఢిల్లీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 17 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈనెల 10న జరిగే ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.