పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలనుకున్నా:కోహ్లీతో రోహిత్

Update: 2019-07-07 11:16 GMT

పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలని దక్షిణాఫ్రికా పై సెంచరీ చేశాకా నిర్ణయించుకున్నాను. అదేవిధంగా ఆడుతున్నాను. అంటున్నాడు హిట్ మేన్ రోహిత్ శర్మ. టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ప్రపంచ కప్ పోటీల్లో జట్టును ముందుండి నడిపిస్తున్న రోహిత్ శర్మ లీగ్ దశలో ఐదు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రోహిత్ ను ఈ రికార్డు సేన్చారీల అనుభవం ఎలా ఉందంటూ ప్రశ్నించాడు. దానికిర రోహిత్ ఇలా స్పందించాడు. ''ఈ ప్రపంచకప్‌ ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో జట్టు బాగా రాణించడం బాగుంది. ఒక బ్యాట్స్‌మన్‌గా, ఓపెనర్‌గా నా ఫామ్‌ని కొనసాగించాలనుకున్నాను'' కెప్టెన్ కోహ్లీకి వివరించాడు రోహిత్ శర్మ. 


Tags:    

Similar News