Viral Video: చిరుతలా చురుకుదనం, డేగలా దూకడం..ధోనికి వయసుతో సంబంధం లేదని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది

Viral Video: ఎంఎస్ ధోని క్రికెట్ ప్రపంచంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఆటగాడు. టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ సమయంలో ధోని ఆటను చూసేందుకు అతని అభిమానులు ఏడాది పాటు ఎదురుచూస్తుంటారు.
ప్రస్తుతం ధోని వయసు 43ఏళ్లు. గత రెండేళ్లుగా ఐపీఎల్ ఆరంభం అవుతున్న ప్రతిసారి ధోనికి ఇదే ఆఖరి సీజన్ అంటూ జోరుగా ప్రచారం అవుతుంది. అయితే ధోని మాత్రం తాను మరోసీజన్ ఆడుతానంటూ కొత్త సీజన్ బరిలో నిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోని మరోసారి బరిలోకి దిగాడు.
ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తన మొదటి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో ధోని ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటూ తన వికెట్ కీపింగ్ నైపుణ్యాన్ని మరోసారి అందరికీ రుచి చూపించాడు. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్ లో ధోని మెరుపు స్టంపింగ్ తో ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను పెవిలియన్ కు చేర్చాడు. 29 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్..నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్ 3వ బంతిని ఆడే ప్రయత్నంచేశాడు.
ఆ క్రమంలో క్రీజును వదలికాస్త ముందుకు వచ్చాడు. అయితే బంతి టర్న్ అవుతూ సూర్యకుమార్ యాదవ్ ను బీట్ చేస్తూ ధోని చేతుల్లోకి వెళ్లింది. అంతే రెప్పపాటు కాలంలో స్టంప్స్ ను గిరవాటేసిన ధోని మెరుపు స్టింపింగ్ తో సూర్యకుమార్ యాదవ్ ను అవుట్ చేశాడు. ధోని కాకుండా వేరే ఏ వికెట్ కీపర్ అక్కడున్నా సూర్యకుమార్ యాదవ్ స్టంపౌట్ అయ్యేవాడు కాదు. ప్రస్తుతం ఈ స్టింపింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.