SRH vs LSG match: అయ్యో ఇషాన్ కిషన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గట్టి దెబ్బ కొట్టిన శార్ధూల్ థాకూర్

SRH vs LSG match: అయ్యో ఇషాన్ కిషన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి దెబ్బ కొట్టిన శార్ధూల్ థాకూర్
SRH vs LSG match: ఐపిఎల్ 2025 లో భాగంగా గురువారం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయిన ఇషాన్ కిషన్‌ను ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్ శార్ధూల్ థాకూర్ డకౌట్ చేశాడు. తను ఎదుర్కున్న మొదటి బంతినే ఇషాన్ కిషన్ షాట్ కొట్టేందుకు ట్రై చేయగా ఆ బంతిని రిషబ్ పంత్ క్యాచ్ పట్టాడు.
అంతకంటే ముందుగా అదే ఓవర్‌లో అభిషేక్ శర్మను కూడా శార్ధూల్ థాకూర్ 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దే ఔట్ చేశాడు. అభిషేక్ శర్మ హిట్ ఇచ్చిన బంతిని నికోలస్ పూరన్ క్యాచ్ పట్టాడు. వరుసగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఔట్ అవడంతో మ్యాచ్‌లో 3 ఓవర్లు కూడా ముగియకుండానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 15 పరుగుల వద్ద ఉండగానే 2 వికెట్లు కోల్పోయినట్లయింది.
ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ వంటి ఆటగాళ్లపైనే ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ ప్రియులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ జట్టు స్కోర్‌ను పెంచే ప్రయత్నంలో ఉన్నాడు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ట్రావిస్ హెడ్ జట్టు స్కోర్‌ను 62 పరుగులకు తీసుకెళ్లాడు. అందులో హెడ్ వ్యక్తిగతంగా స్కోర్ 42 పరుగులు రాబట్టాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ 2 ఫోర్లు, 2 సిక్సులు బాది స్కోర్‌లో వేగం పెంచాడు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టేన్ రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగింది. కానీ ఆదిలోనే శార్దూల్ థాకూర్ రూపంలో హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది.