SRH Vs LSG: ఐపీఎల్‌లో నేడు ఆసక్తికర పోరు.. వైనాట్ 300 అంటూ బరిలోకి ఆరెంజ్ ఆర్మీ
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరును సాధించింది.

SRH Vs LSG: ఐపీఎల్‌లో నేడు ఆసక్తికర పోరు.. వైనాట్ 300 అంటూ బరిలోకి ఆరెంజ్ ఆర్మీ
SRH Vs LSG: ఐపీఎల్‌లో ఇవాళ ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. భీకరమైన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో చివరి క్షణంలో పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో రెండు బలమైన జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరును సాధించింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 286 పరుగులు చేసింది. అయితే 300 పరుగులను కొద్దిలో మిస్ అయిన ఆరెంజ్ ఆర్మీ ఈ మ్యాచ్‌లో రీచ్ అవుతుందని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టు 300 పరుగులు చేయలేదు. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో టాప్-3 అత్యధిక స్కోర్లు సన్‌రైజర్స్ ఖాతాలోనే ఉన్నాయి.
ఇవాళ సన్‌రైజర్స్, లక్నో తలపడనున్న పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. రెండు టీమ్‌లు బ్యాటింగ్‌లో బలంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 286 పరుగులు చేయగా..ఛేజింగ్‌లో రాజస్థాన్ రాయల్స్ కూడా 242 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓడినా అద్భుతంగా పోరాడింది. అందుకే ఈ రోజు కూడా హై స్కోర్ మ్యాచ్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, లక్నో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో లక్నో మూడు గెలువగా.. సన్‌రైజర్స్ కేవలం ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్సే విజయం సాధించింది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్, లక్నో రెండూ బలంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో విధ్వంస బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. అభిషేక్, హెడ్, ఇషాన్, క్లాసెన్, నితీశ్‌తో సన్‌రైజర్స్ స్ట్రాంగ్‌గా ఉండగా.. లక్నోలో మిచెల్ మార్ష్, పూరన్, మార్క్రమ్, మిల్లర్, పంత్ ఉన్నారు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడినా లక్నో బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లు కూడా రాణించారు. గత మ్యాచ్‌తో పోలిస్తే నేటి మ్యాచ్‌లో లక్నో బౌలింగ్ మరింత బలపడనుంది. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఆవేశ్ ఖాన్ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగవచ్చు. దీంతో రెండు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశాలున్నాయి.