CSK vs RCB: 17ఏళ్లుగా దిక్కూదివానం లేదు.. అయినా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే భయ్యా!
CSK vs RCB: చెపాక్‌లో చెన్నైను ఓడించడం కష్టమేనని షేన్ వాట్సన్ ఆర్సీబీని హెచ్చరించాడు.

CSK vs RCB: 17ఏళ్లుగా దిక్కూదివానం లేదు.. అయినా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే భయ్యా!
CSK vs RCB: చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించడం చిన్న విషయమేమీ కాదని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్. ఐపీఎల్ 2025లో భాగంగా మార్చి 28న చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఇది ఈ సీజన్‌లో ఆర్సీబీకి రెండో మ్యాచ్ కానుంది. ఇక చెన్నైలో సూపర్ కింగ్స్‌పై ఆర్సీబీ గెలిచిన చివరి మ్యాచ్ 2008లో జరిగింది. అంటే, 17 సంవత్సరాలుగా ఆ జట్టు అక్కడ విజయం సాధించలేకపోతోంది. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో, చెపాక్ వేదికగా చెన్నైను ఎదుర్కోవడం రజత్ పటీదార్ నాయకత్వంలోని ఆర్సీబీకి గట్టి పరీక్షగా మారబోతోంది.
వాట్సన్ చెప్పినట్టు, చెపాక్ ఒక కోటలా మారిపోయింది. ప్రత్యేకంగా చెన్నై జట్టు సొంత మైదానంలోకి అడుగుపెడితే, వారు ఎంత బలంగా ఆడతారో వాట్సన్ వివరించారు. చెన్నై స్పిన్నర్లు అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్.. ముంబైపై జరిగిన మొదటి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశారని గుర్తుచేశాడు. ముఖ్యంగా నూర్, మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలిచాడు. అతని పెర్ఫార్మెన్స్ మిగతా జట్టుకే ఉత్సాహం ఇచ్చేలా ఉందని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఆర్సీబీ తమ జట్టులో కొన్ని మార్పులు చేసుకుంటే తప్ప చెన్నై బలాన్ని తట్టుకోలేరని కూడా ఆయన సూచించారు.
ఇప్పటివరకు చెన్నైలో ఆర్సీబీ 14 మ్యాచ్‌లు ఆడగా, కేవలం 5మ్యాచ్‌ల్లోనే విజయాన్ని సాధించారు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను కొనసాగించాలని చూస్తున్న ఆర్సీబీకి ఇది నిజంగా పరీక్షే. ఇద్దరు ప్రత్యర్థుల మధ్య ఇది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు.. ఐపీఎల్ చరిత్రలోని ఎప్పటికీ నిలిచిపోయే రైవల్రీలో ఒకటి. మళ్లీ మరోసారి ఈ పోటీ మైదానంలో ఉత్కంఠను పెంచబోతోంది.