రికార్డులు బద్దలు కొట్టిన మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ పై సమిష్టి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ పై సమిష్టి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, మెల్‌బోర్న్ వేదికగా జరిగిన పైనల్ మ్యాచ్‌కు రికార్డు సంఖ్యలో 86,174 మంది ప్రేక్షకులు మ్యాచ్‌కు హాజరయ్యారు. మహిళల క్రికెట్ చరిత్రలో రికార్డు భారీ సంఖ్యలో వీక్షక్షులు హాజరైన మ్యాచ్‌గా చరిత్రకెక్కింది.
అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున ఇంత ఆదరణ రావడం విశేషం. 2009లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌కు 12,717 మంది మాత్రమే హాజరయ్యారు. ఇంగ్లాండ్× న్యూజిలాండ్ ఫైనల్ కంటే భారత్ ఆసీస్‌కు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య దాదాపు 73 వేలు దాటడం విశేషం. మహిళల సాకర్ ఫైనల్ 21 ఏళ్ల క్రితం ఫైనల్ మ్యాచ్‌కు 90, 185 మంది ప్రేక్షకులు వీక్షించారు.
ఈ సారి మ్యాచ్‌లో ఆసీస్ 85 పరుగుల తేడాతో భారత్ పై ఘన విజయం సాధించి ఐదో సారి టైటిల్ సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 184 పరుగులు చేసింది. అలీసా హీలీ (75), బెత్ మూనీ (78)తో అర్థ సెంచరీతో సత్తాచాటారు. దీప్తి శర్మ రెండు వికెట్లు దక్కించుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయం మూఠకట్టుకుంది.