కొత్త అవతారంలో భజ్జీ ..!
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటి వరకు క్రికెట్ గ్రౌండ్‌లో సందడి చేసిన భజ్జీ ఇక సిల్వర్ స్క్రీన్‌పై మెరవనున్నారు.
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటి వరకు క్రికెట్ గ్రౌండ్‌లో సందడి చేసిన భజ్జీ ఇక సిల్వర్ స్క్రీన్‌పై మెరవనున్నారు. ఈ విషయాన్ని భజ్జీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తను నటించనున్న సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను తన ఖాతాలో షేర్ చేశారు.
భజ్జీ హీరోగా తెరకెక్కనున్న చిత్రం పేరు ఫ్రెండ్‌షిప్ అనే టైటిల్ సినిమా యూనిట్ ఖరారు చేసింది. అయితే భజ్జీ నటిస్తుందని తమిళ సినిమా కావడం విశేషం.
ఈ సినిమాకు జాన్ పాల్ రాజ్, షామ్ సూర్య దర్శకత్వం వహించారు. జేపీఆర్ స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హర్భజన్ సింగ్ 'ఫ్రెండ్‌షిప్' అని ఆ పోస్టర్ లో రాసివుంది. ఇద్దరు వ్యక్తుల చేతులకు బేడీలు వేసి ఉంది. దక్షిణభారతీయ సినిమాలో క్రికెట్ దిగ్గజం ప్రధాన పాత్రలో నటిస్తు్న్నారని హర్భజన్ సింగ్ పోస్ట్ చేసిన పోస్టరులో రాసి ఉంది. ఈ చిత్రం సంవత్సరం థియేటర్లలో సందడి చేయనుంది.
పంజాబీ, హిందీ చిత్రాలల్లో నటించిన నటీ గీతా బస్రాను భజ్జీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గీతాబస్రా నటించిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్' సినిమాలో హర్భజన్ సింగ్ కీలక పాత్ర కూడా చేశారు. గీతా ప్రోద్భలంతోనే హర్భజన్ సింగ్ సినిమాల్లో నటించేందుకు మొగ్గచూపుతున్నారని తెలుస్తోంది. క్రికెట్ రాణించిన ఈ దిగ్గజం థియేటర్స్‌లో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి మరి.
టీమిండియా తరఫున హర్భజన్ 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టాడు. 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో 25 వికెట్లు పడగొట్టారు. హర్భజన్ సింగ్ 2015లో సౌతాఫ్రికాపై టీమిండియా తరపున చివరి వన్డే ఆడారు. మొత్తం మీద భారత్ జట్టు తరపున 711 వికెట్లు పడగొట్టారు. గంగూలీ కెప్టెన్సీలో భజ్జీ కీలక ఆటగాడిగా మారాడు.
For the first time in Indian cinema.Indian cricketer @harbhajan_singh will be playing lead role in the upcoming #Friendship Movie.This"2020" is Will be Unexpected
— Ramesh Bala (@rameshlaus) February 2, 2020
And its going to Spin WorldWide.@JPRJOHN1 @ImSaravanan_P #ShamSurya @RIAZtheboss#SeantoaStudio #Cinemaasstudio pic.twitter.com/hT6N8oH7I1