IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని రద్దు చేయండి.. షారుక్, నెస్ వాడియాల మధ్య వాగ్వాదం..
IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని రద్దు చేయండి.. షారుక్, నెస్ వాడియాల మధ్య వాగ్వాదం..
IPL 2025 Auction: ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (జులై 31) ముంబైలో మొత్తం 10 జట్ల యజమానులతో సమావేశం నిర్వహించింది. సమావేశం తర్వాత బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ, ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన అనేక అంశాలపై భారత క్రికెట్ బోర్డు బుధవారం 10 ఫ్రాంచైజీల యజమానులతో చర్చలు జరిపింది.
'ఫ్రాంచైజీ యజమానులు ఆటగాళ్ల నియంత్రణ, లైసెన్సింగ్, గేమింగ్‌తో సహా అనేక వాణిజ్య అంశాలపై అభిప్రాయాన్ని అందించారు. రాబోయే కొద్ది వారాల్లో ఫ్రాంచైజీలకు బీసీసీఐ తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు.
ANI ప్రకారం, సమావేశం తర్వాత, BCCI కార్యదర్శి జైషా, పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ BCCI ప్రధాన కార్యాలయం వెలుపల కనిపించారు.
మెగా వేలంపై టీమ్‌లు నిరసన..
అదే సమయంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యజమాని షారుక్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సీఈవో కావ్య మారన్ కీలక డిమాండ్ చేశారు. ఐపీఎల్ 2025 మోగా వేలాన్ని రద్దు చేయాలంటూ కోరారు.
షారుక్, నెస్ వాడియాల మధ్య వాగ్వాదం..
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, షారుక్ ఖాన్ తదుపరి మెగా వేలానికి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే పంజాబ్ కింగ్స్ యజమాని నెస్ వాడియా వేలం వేయాలని కోరుకున్నాడు. మినీ వేలం నిర్వహించాలని, వీలైనంత ఎక్కువ మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వెసులుబాటు కల్పించాలని షారుక్ సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, నెస్ వాడియా దీన్ని స్పష్టంగా ఖండించారు. ఈ విషయంపై చర్చ జరుగుతుండగానే ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైందని తెలుస్తుంది.