టీమిండియా బౌలింగ్ తురుఫు ముక్క.. జస్ప్రీత్ బుమ్రా తన 50 వ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. ప్రపంచ కప్ లో తోలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా కీలక బౌలర్ గా.. ప్రధాన బౌలింగ్ అస్త్రంగా దక్షిణాఫ్రికా పని పట్టడం మొదలు పెట్టాడు. రెండో ఓవర్ లోనే ఆమ్లాను అవుట్ చేసిన బుమ్రా.. ఆరో ఓవర్లో డీకాక్ ను పెవిలియన్ కు పంపించి సౌతాఫ్రికా కు షాక్ ఇచ్చాడు. తన 50 వ మ్యాచ్ సందర్బంగా ఐసీసీ బుమ్రాను అభినందిస్తూ ట్వీట్ చేసింది.
భారత్ కు మంచి ప్రారంభాన్ని ఇచ్చిన బుమ్రా.. తన 50 వ మ్యాచ్ ఆడుతున్నాడు.
రెండో ఓవర్లోనే ఆమ్లా వికెట్ తీశాడు అంటూ ట్విట్టర్లో ఫోటో తో పాటు కామెంట్ పెట్టింది.
What a start for India! Bumrah, who is playing his 50th ODI today, strikes in his second over and Amla has to go! #SAvIND LIVE 🔽 https://t.co/BRFVfISGgy pic.twitter.com/uDUWvkp5GI
— ICC (@ICC) June 5, 2019