మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారాకు అస్వస్థత

Update: 2019-06-25 10:36 GMT

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో ముంబైలోని గ్లోబల్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ఇంగ్లండ్ లో జరుగుతున్న ప్రపంచకప్ ను టెలికాస్ట్ చేస్తున్న ఛానల్ కు బ్రియాన్ లారా క్రికెట్ ఎక్స్ పర్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆయన ముంబైలో ఉంటున్నారు. అయితే లారా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

Tags:    

Similar News