భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అయన బీజేపిలో చేరుతారని కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాస్వాన్ తెలిపారు . తాజగా అయన మీడియాతో మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేసారు . " ధోని నాకు చాలా బాగా తెలుసు .. నాకు మంచి స్నేహితుడు కూడా అతన్ని బీజేపిలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పటికే దీనిపైన చర్చలు కూడా అయిపోయాయని ధోని రిటైర్మెంట్ తీసుకోవడమే లేట్ " అని సంజయ్ పాస్వాన్ చెప్పుకొచ్చారు .. అయితే ఈ ఏడాదిలో ధోని రాష్ట్రం అయిన జార్ఖండ్ లో ఎన్నికలు జరగనున్నాయి . అందులో భాగంగానే ధోనిని బీజేపిలో చేర్చుకొని సీఎం అభ్యర్ధిగా ప్రమోట్ చేయాలనీ బీజేపి నాయకులూ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది .