బిగ్ బౌట్ ఇండియన్ బాక్సింగ్ లీగ్ లో ఆడే బాక్సర్ల వివరాలను బీఎఫ్ఐ ప్రకటించింది. భారత బాక్సింగ్ సమాఖ్య ఆద్వర్యంలో నిర్వహించనున్న ఈ లీగ్ వచ్చే నెల 2 నుంచి 21వ తేదీ వరకు జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మాజీ చాంపియన్ నిఖత్ జరీన్ ఒడిశా వారియర్స్‌కు తరపున ఆడనుంది. మేరీకోమ్ పంజాబ్ రాయల్స్ తరపున పోటీలో దిగనుంది. నిఖత్ జరీన్ తెలంగాణ బాక్సర్, అంతే కాకుండా వరల్డ్ జూనియర్ చాంపియన్ కూడా.. మేరికోమ్, నిఖత్ ఇద్దరు 51 కేజీల విభాగంలో బరిలోకి దిగడం విశేషం. వరల్డ్ చాంపియన్ సిల్వర్ మెడలిస్టు పంఘాల్ గుజరాత్ కు పాతినిధ్యం వహించనున్నాడు. అమిత్ పంఘాల్ టీమ్ గుజరాత్ అదానీకి ఏపీ బాక్సర్ ప్రసాద్ పురుషుల విభాగంలో పంజాబ్ రాయల్స్ తరపున పోటీలోకి దిగనున్నాడు.
జట్ల వివరాలు
నార్త్ ఈస్ట్ రైనోస్, బెంగళూరు బ్రాలర్స్, ఒడిశా వారియర్స్, టీమ్ గుజరాత్ అదానీ, పంజాబ్ రాయల్స్, బాంబే బుల్లెట్స్.
వెయిట్ కేటగిరీలు
మహిళల విభాగంలో 51 కేజీలు, 60 కేజీలు ఉంటుంది.
పురుషుల విభాగం: 52 ,57, 69 కేజీలు అలాగే 75 కేజీలు, 91 కేజీలు పురుషులు తలపడనున్నారు.