వైరల్ వీడియో.. గ్రౌండ్‌లోనే చిందేసి సంబరాలు చేసుకున్న అభిమానులు

రాజ్‌కోట్ లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా భారత్ ఘనవిజయం సాధించింన సంగతి తెలిసిందే.

Update: 2020-01-18 12:10 GMT

రాజ్‌కోట్ లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా భారత్ ఘనవిజయం సాధించింన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి మూడు వన్డే సిరీస్ సమం చేసింది. మూడో వన్డే బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్(96), కోహ్లీ(78), కేఎల్ రాహుల్(80), రోహిత్ శర్మ (42) పరుగులతో రాణించారు. అయితే మొదటి వన్డేలో భారత్ దారుణంగా ఓడిపోయింది. అయితే ఓటమితో భారత్ సూర్తిపాందిందనే చెప్పాలి. ఈ సిరీస్ లో నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం బెంగళూరులో జరగనుంది.

తొలి వన్డేలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై సమిష్గిగా పొరాడి విజయం సాధిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్ లో మొత్తానికి క్రికెట్ అభిమానులకు కావాల్సిన మాజా ఇచ్చారు. ఈ మ్యాచ్ లో బౌలర్ల నిప్పులు చెరిగే బంతులు, బ్యాట్స్ మెన్ మెరుపులు, ఫీల్డర్స్ విన్యాసాలు కనివిందు చేశాయి.

రెండో వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలో ఓ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియో ట్రెండ్ అవుతోంది. ఇంతకి ఆ విడియో ఎమింటంటే క్రికెట్ ముగిసిన అనంతరం మైదానంలో స్వీపర్స్ గర్బా డ్యాన్స్ చేశారు. మ్యాచ్ ముగిసి తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటున్నారు. మరోవైపు మ్యాచ్ గెలిచిన ఆనందంలో వైదానంలో ముగ్గురు స్వీపర్లు డాన్స్ చేశారు. గర్బా డ్యాన్స్‌తో కెమెరాను కంట పడ్డారు. దీనిని ఓ నెటిజన్ కెమెరాలో బందించాడు. బెస్ట్ మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ అంటూ ట్విట్ చేశారు. దీనిపై ఆసీస్ మీడియా మరోలా వ్యాఖ్యానించింది. స్క్రబ్బర్స్‌తో పిచ్ శుభ్రపరుస్తున్నారని హేళన చేసింది.

   

 

Tags:    

Similar News