ఇంగ్లాండ్ గెలుపు కోసం కొడుకు .. న్యూజిలాండ్ గెలుపు కోసం తండ్రి ..

Update: 2019-07-15 06:05 GMT

నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ నిన్న వరల్డ్ కప్ ఫైనల్లో  అందరికి కనిపించింది. అసలు ఏ టీం గెలుస్తుందన్న ఆత్రుతని ప్రతి ఒక్కరిలోను నెలకొల్పాయి ఇరు జట్లు. అయితే ఇంగ్లాండ్ జట్టు బాట్స్ మన్ బెయిన్ స్టోక్స్ మాత్రం మ్యాచ్ చివరివరకు పోరాడి ఇంగ్లాండ్ జట్టును విశ్వవిజేతగా నిలబెట్టాడు .. అయితే బెయిన్ స్టోక్స్ తండ్రి మాత్రం న్యూజిలాండ్ జట్టు గెలవాలని ప్రార్ధించాడు . లార్డ్స్ వేదికంగా జరిగిన ఈ మ్యాచ్ ని అయన స్వయంగా వీక్షించారు . ప్రతి నిమిషం జట్టు పోరాటం కోసం అయన దేవున్ని ప్రార్ధించాడు . కానీ చివరికి మాత్రం విజయం ఇంగ్లాండునే వరించింది. తన కొడుకు పోరాటం చూసి బెయిన్ స్టోక్స్ తండ్రి మురిసిపోయాడు . స్టోక్స్‌ పుట్టింది న్యూజిలాండ్. అక్కడ పుట్టి ఆ తర్వాత ఇంగ్లాండ్‌కు వలస వచ్చి ఇక్కడ స్టార్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.

Tags:    

Similar News