IPL 2023: ఐపీఎల్ 2023లో కొత్త రూల్..
IPL 2023: ప్రతి ఏటా జనరంజకంగా సాగిపోతున్న ఐపీఎల్ లో ఓ కొత్త రూల్ తీసుకువస్తున్నారు.
IPL 2023: ప్రతి ఏటా జనరంజకంగా సాగిపోతున్న ఐపీఎల్ లో ఓ కొత్త రూల్ తీసుకువస్తున్నారు. ఫుట్ బాల్ తరహాలో ఐపీఎల్ లోనూ 'సబ్ స్టిట్యూట్' విధానం ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా క్రికెట్లో 'సబ్ స్టిట్యూట్' అంటే, ఎవరైనా గాయపడితే వారి బదులు ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ, వచ్చే ఐపీఎల్ సీజన్ తో సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారు.
ఐపీఎల్ లో 'సబ్ స్టిట్యూట్' తో బౌలింగ్, బ్యాటింగ్ చేయించుకోవచ్చు. ఈ సబ్ స్టిట్యూట్ ను 'ఇంపాక్ట్ ప్లేయర్' అని పిలుస్తారు. టాస్ సమయంలో ఒక్కో జట్టు 'ఇంపాక్ట్ ప్లేయర్' కోటాలో నలుగురి పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. మ్యాచ్ సాగే సమయంలో ఆ నలుగురిలో ఒకరిని 'సబ్ స్టిట్యూట్' గా బరిలో దింపి బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయించుకోవచ్చు. అయితే ఏ ఇన్నింగ్స్ లో అయినా 14వ ఓవర్ ముగియడానికి ముందే ఈ 'సబ్ స్టిట్యూట్' ను బరిలో దింపాల్సి ఉంటుంది. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది.