ప్రపంచ కప్ లో భాగంగా భారత్ సెమిస్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు పై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది . దీనితో టోర్నీ నుండి భారత్ నిష్క్రమించింది . అయితే మ్యాచ్ ఓటమిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది . జట్టు ఓటమికి గల కారణాల గురించి జట్టు కోచ్ రవిశాస్త్రి మరియు కెప్టెన్ కోహ్లి వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది . ఇందులో భాగంగా కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీవోఏ) వీరిని మూడు ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం .
1. జట్టులోకి రాయుడిని ఎందుకు తీసుకోలేదు .
2. జట్టులో నలుగురు కీపర్లు ఎందుకు ?
3. సెమిస్ మ్యాచ్ లో ధోనిని ఆలస్యంగా పంపడానికి గల కారణం ఏంటి ?
దీనిపై మరి రవిశాస్త్రి, కోహ్లి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి ..