బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా సునీల్ జోషీ
-సునీల్ జోషి పేరును బీసీసీఐకి సిఫార్సు చేసిన సీఏసీ -1996-2001లో టీమిండియా తరపున సునీల్ జోషి ప్రాతినిధ్యం
బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సునీల్ జోషీ నియమితులయ్యారు. సునీల్ జోషి పేరును మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ బీసీసీఐకి సిఫార్సు చేసింది. వెంకటేశ్ ప్రసాద్ నుంచి తీవ్ర పోటీ ఏర్పడినప్పటికీ సునీల్ వైపే సీఏసీ మొగ్గు చూపింది.
1996-2001 మధ్య కాలంలో టీమిండియా తరపున సునీల్ జోషి ప్రాతినిధ్యం వహించారు. 15 టెస్టులు, 69 వన్డేలు ఆడారు. స్వదేశంలో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం సునీల్ జోషీ ఆద్వర్యంలోని కమిటీనే టీమిండియాను ఎంపిక చేయనుంది.