ఐపీఎల్ ఫైనల్ పోరులో తొలి బ్యాటింగ్ ముంబైదే

Update: 2019-05-12 13:50 GMT

క్రికెట్ అభిమానులను కొంత కాలంగా ఊపేస్తున్న ఐపీఎల్ 12వ సీజన్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ లో ఇప్పటి వరకూ మూడేసి సార్లు కప్పు గెలుచుకున్న దిగ్గజ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆమీ తుమీ పోరాటానికి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆతిధ్యమిస్తోంది. ఫైనల్ మ్యాచ్ లో ముంబై జట్టు కెప్టెన్ టాస్ గెలిచాడు. తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

అభిమానుల కోలాహలం తో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి. ఇప్పటికే స్టేడియం పూర్తిగా నిండిపోయింది. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు చర్యలు చేపట్టారు. అభిమానుల సందడితో స్టేడియం మెరిసిపోతోంది. ఇక మెట్రో రైల్ సర్వీసును ఈ రోజు రాత్రి 1 గంట వరకూ నడపాలని హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయించారు. అభిమానులు ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసినట్టు వారు ప్రకటించారు. కొద్దీ సేపట్లో ప్రారంభం కానున్న మ్యాచులో గెలుపు ఎవరిదని విషయంపై రెండు జట్ల అభిమానులు ఉత్కంఠగా స్టేడియంలో ఎదురుచూస్తున్నారు.

తుది పోరుకు తుది జట్టులివే!

ముంబయి: రోహిత్‌ శర్మ, డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కృనాల్‌ పాండ్య, హార్దిక్‌ పాండ్య, కీరన్‌పొలార్డ్‌, రాహుల్‌ చాహర్‌, మిచెల్‌ మెక్లెనగన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ

చెన్నై: డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, సురేశ్‌రైనా, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్‌సింగ్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌

Similar News