బంగ్లా క్రికెట్ జట్టు ఇండియా పర్యటనపై నీలినీడలు
మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్ ల్లో భాగంగా వచ్చే నెలలో బంగ్లాదేశ్ జట్టు భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే బంగ్లా టూర్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.
మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్ ల్లో భాగంగా వచ్చే నెలలో బంగ్లాదేశ్ జట్టు భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే బంగ్లా టూర్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటీవలె ఆఫ్ఘనిస్థాన్ పై జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. తీవ్రంగా పరిగణించిన ఆదేశ క్రికెట్ బోర్డు బీపీఎల్ మ్యాచ్ ల్లో ప్రతి జట్టులో లెగ్ స్పిన్నర్‌ను ఆడించాలని నిబంధన విధించింది.
కొత్త నిబంధనలు అణగదొక్కేలా ఉన్నాయని బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ అన్నారు. బంగ్లా క్రికెటర్ల పారితోషికం చెల్లింపుల విధానాలు మార్చాలని కోరాడు. అంతే కాకుండా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లలో ఆడే ఆటగాళ్లకు సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. కొన్ని డిమాండ్లను బోర్డు ముందు ఉంచారు. అప్పటి వరకు తాము క్రికెట్ అడమని తేల్చి చేప్పారు. ఈ నేపథ్యంలో బంగ్లా జట్టు భారత్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.